తిరుమలలో వైకుంఠద్వార దర్శనం..పోటెత్తిన భక్తులు
వైకుంఠద్వారం నుండి స్వామి దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని నానుడి. దీనితో భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఇప్పటి నుండే క్యూకాంప్లెక్సులన్నీ రద్దీగా మారాయి. కలియుగదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి ఎల్లప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన రోజులలో అయితే ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. డిసెంబరు 23శనివారం వైకుంఠఏకాదశి పర్వదినాన్ని పునస్కరించుకుని తిరుమలలో స్వామి దర్శనానికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు టిటిడి. భక్తుల కోసం టిటిడి నేటి నుండి పది రోజుల పాటు ఈ ఉత్తర ద్వార దర్శనం కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్జిత సేవలను రద్దు చేసి, కేవలం దర్శనం మాత్రమే కలుగజేస్తున్నారు.

