పోలవరంలో విదేశీనిపుణుల పర్యటన
పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్,గ్యాప్-2లను పరిశీలిస్తున్నారు. రెండురోజుల పాటు వీరు ఈ పోలవరంలో పర్యటన చేసి, వాటర్ ఫ్లో, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలను పరిశీలిస్తున్నారు. వీరి పర్యటన జూలై 3 వతేదీ వరకు కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇంజనీర్లు, కాంటాక్టు ఏజెన్సీలతో కూడా సమీక్షను జరుపనున్నారు. సీపేజీ తీవ్రతను తెలిపే సీజీయో మీటర్ రీడింగులు, మట్టి, రాతి నాణ్యత పరిశీలన,జియో టెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పరిస్థితిపై వీరు నివేదికలు ఇస్తారు.ఈ పర్యటన అనంతరం ఇతర అధికారులతో చర్చించి వీటిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిని త్వరలోనే పూర్తి చేసిన జాతికి అంకితం చేస్తామని మాట ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు పాడయ్యిందని పేర్కొన్నారు.

