Home Page SliderTelangana

ముక్కుసూటి తనానికి మారుపేరు విశ్వనాథ్

విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సాంఘికాలే. పౌరాణిక సినిమాల జోలికి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. ఆ విషయం గురించి ప్రస్తావనకు వస్తే పౌరాణికాలు తీయటానికి వాటి మీద తనకు తగినంత అవగాహన లేదని ధైర్యంగా ముక్కుసూటిగా చెప్పేవారు. అంతేకాదు గౌతమ బుద్ధుడు, ఆది శంకరుడు, అన్నమయ్య, రామదాసు లాంటి సినిమాలను నిర్మించమని పెద్ద నిర్మాతల నుంచి అవకాశాలు వచ్చిన వాటిని విశ్వనాథ్ అంగీకరించలేదు. ఆయన తీసిన స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ బహుమతికి భారతదేశపు అధికార ఎంట్రీగా ఎంపిక అయింది. ఉత్తమ దర్శకుడుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశ్వనాధ్ ఐదు సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు. శంకరాభరణం సినిమా ఆయనకు జాతీయ పురస్కారాన్ని అందించింది. 2016లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కళాతపస్వి విశ్వనాథుని వరించింది.