విశ్వక్‌సేన్ “లైలా” ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్‌లో మాస్ క్యారెక్టర్స్‌కు యంగ్ హీరో విశ్వక్ సేన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. అయితే ఆయన తొలిసారి లేడి గెటప్‌లో కనిపించబోతున్నారు. కాగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ “లైలా” సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని చిత్రబృందం ఇవాళ నిర్వహించింది. ఈ సందర్భంగా “లైలా” సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.దీంట్లో విశ్వక్ సేన్ లేడి గెటప్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

