మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన విష్ణు
పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను సినీ నటుడు, మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు పరామర్శించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పిన విష్ణు ఓదార్చారు. మధుసూదన్ రావు ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉగ్రదాడి బాధకరమన్నారు. ఆ కుటుంబానికి సహయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసానిచ్చారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కూడా ఉన్నారు.