ముంబైలా అభివృద్ధి చెందనున్న విశాఖ: సీఎం చంద్రబాబు
అమరావతి: రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడుతూ, విశాఖపట్నం ముంబై తరహాలో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
గూగుల్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖకు రావడంతో, అది త్వరలోనే దక్షిణ భారత ఐటీ హబ్గా మారుతుందని తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, సంస్థలు స్థాపించేలా మంత్రులు వ్యక్తిగతంగా ముందడుగు వేయాలని సీఎం సూచించారు.