Home Page SliderInternational

విరాట్ కోహ్లి అరుదైన రికార్డు..స్పెషల్ పోస్ట్  పెట్టిన అనుష్క

స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించారు. తన 500వ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచారు. ఈ విషయంలో అనుష్కశర్మ ఆనందానికి అవధులు లేవు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేకంగా విరాట్ ఫొటోపై లవ్ సింబల్ ఉంచి షేర్ చేసింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో 121 పరుగులతో సెంచరీ సాధించారు విరాట్. టెస్టుల్లో ఇది 29 వ సెంచరీ, అన్ని ఫార్మాట్లలో కలిపి 76 వ సెంచరీగా విరాట్ రికార్డులలో నిలిచింది ఈ సెంచరీ. ఈ సెంచరీతో సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన 500వ మ్యాచ్ రికార్డును అధిగమించారు విరాట్. సచిన్ 500 వ మ్యాచ్‌ ముగిసేసరికి 75 సెంచరీలు సాధించగా, కోహ్లి 76 సెంచరీలు సాధించడం విశేషంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విండీస్ ఇప్పటికి 86 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయి ఆటను కొనసాగిస్తోంది.