హైదరాబాద్‌లో పెరుగుతున్న వైరల్ ఫీవర్స్
హైదరాబాద్‌లో వైరల్ జ్వరాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే వైరల్ ఫీవర్ వస్తే నాలుగైదు రోజుల్లో అదే తగ్గిపోతుంది. కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా లేదని వైరల్ ఫీవర్లు పదిరోజుల దాకా కూడా తగ్గకుండా ఉంటున్నాయని.. కొందరిలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌కు గురై న్యూమోనియా బారిన పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. వారిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుండడంతో ఐసీయులో చేర్పించి చికిత్స చేయాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.