వినేశ్ ఫొగట్‌కు హర్యానా ముఖ్యమంత్రి హామీ
పారిస్ ఒలింపిక్ బరిలో చివరిదాకా పోరాడి, ఫైనల్ రేసులో అనర్హత వేటు పడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించినవారికి వచ్చే అన్ని సౌకర్యాలు కలగజేస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయూబ్ సైనీ హామీ ఇచ్చారు. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా ఆమె ఒలింపిక్స్ రేసులో ఫైనల్స్ ఆడనివ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు సీఎం. ఆమె ఆడకపోయినా ఛాంపియనేనని పేర్కొన్నారు. ఆమెను చూసి యావత్తు దేశం గర్వపడుతోందన్నారు. ఒలింపిక్ మెడల్ సాధించిన వారికి జరిగినట్లే ఆమెకు స్వాగత సత్కారాలతో ఆహ్వానిస్తామన్నారు. సకల మర్యాదతో ఊరేగింపులు జరపడానికి ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఆమెకు రజకపతకానికి వచ్చే సకల సౌకర్యాలు, సన్మానాలు అందిస్తామని ప్రకటించారు.