Home Page SliderNational

నీరసంతో డీలాపడిన వినేష్ ఫొగట్

బరువు ఎక్కువగా ఉండటంతో వినేష్ ఫొగట్ రాత్రంతా వివిధ రకాల ఎక్సర్‌సైజులతో బరువు తగ్గేందుకు తీవ్రంగా యత్నించారు. ఆహారం, నీరు కూడా తీసుకోకపోవడంతో ఈరోజు ఉదయానికి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికావలసి వచ్చింది. ఇంత చేసినా 100 గ్రాముల బరువు ఎక్కువగానే ఉన్నారు. ఈ క్రమంలో ఒంట్లో ఓపిక లేక నీరసంతో కూలబడిపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ ఫొటోలు చూసి చలించిపోతున్నారు.