ఏపీ హోంమంత్రిని కలిసిన గ్రామ,వార్డు మహిళా పోలీసులు
ఏపీ గ్రామ సచివాలయ,వార్డు మహిళా పోలీసులు ఇవాళ వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితని కలిశారు. కాగా డీజీపీ కార్యాలయం నుంచి తమకు ప్రత్యేక జాబ్ ఛార్ట్ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గందరగోళ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నామని మంత్రికి తెలిపారు.అంతేకాకుండా విధి నిర్వహణలో తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నామని వారు హోంమంత్రికి వెల్లడించారు. కాగా తమకు మాతృత్వ సెలవులు కూడా లేవని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసులు హోమంత్రి అనితకు వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు.