Home Page SliderNational

విక్రమ్ “తంగలాన్” మూవీ ట్రైలర్ విడుదల

జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో స్టార్ హీరో విక్రమ్ నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ సినిమా “తంగలాన్”. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తే బంగారం గని తవ్వకాలు జరిపే వారి జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. పా.రంజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే వచ్చే నెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.