Home Page SliderNational

రాష్ట్రాల ఉమ్మడి కృషితోనే వికసిత్ భారత్- నరేంద్రమోదీ

నీతి అయోగ్ పాలనామండలి సమావేశం ముగిసింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ఉమ్మడి కృషి వల్లనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 2027 సంవత్సరం నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టవలసిన ప్రణాళికలపై చర్చలు జరిపారు. ఈ చర్చలలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ మనం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో ప్రయాణిస్తున్నాం అన్నారు. వందేళ్లలో ఒక్కసారి వచ్చే మహమ్మారులను కూడా ఓడించాం. అన్ని రాష్ట్రాల ఉమ్మడిగా కలిసి వచ్చి, కేంద్రప్రభుత్వానికి సహకరిస్తే 2047 నాటికి వికసిత భారత్ కల సాకారమవుతుందని పేర్కొన్నారు.