Home Page SliderTelangana

నూతన స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన్ను స్పీకర్‌గా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.