విజయవాడ MP చిన్ని–తిరువూరు MLA కొలికపూడి వివాదం ముదురుతోంది
విజయవాడ MP చిన్ని మరియు తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు బహిరంగంగా ముదురుతున్నాయి. కొలికపూడి గెలుపు కోసం తాను ₹18 కోట్లు ఖర్చు చేశానని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ నేత జవహర్ కుమారుడు పోటీ చేస్తారని చిన్ని చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందని MLA కొలికపూడి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “12 నెలల పాటు నన్ను దేవుడని అన్న వారు, ఇప్పుడు దెయ్యమని ఎందుకు అంటున్నారు?” అని చిన్ని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. పార్టీ నాయకత్వం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం.

