మళ్లీ యాక్షన్ మోడ్‌లో విజయశాంతి..
‘కర్తవ్యం’ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటించి జాతీయ ఉత్తమనటి అవార్డు గెలుచుకుని సంచలనం సృష్టించారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత మళ్లీ యాక్షన్ మోడ్‌లో అభిమానులను అలరించనున్నారు. అప్పటి వైజయంతికి కొడుకు ఉంటే ఎలా ఉంటాడనే ఇతివృత్తంతో రూపొందిన కొత్త చిత్రం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మళ్లీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు విజయశాంతి. ఈ చిత్రంలో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు చూసి మూవీ టీమ్ అంతా ఆశ్చర్యపోయిందని ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి పేర్కొన్నారు

