పవన్‌పై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
ఎంపీ విజయసాయిరెడ్డి, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. విపక్ష వైసీపీ పార్టీలో కీలక బాధ్యతలలో ఉన్న విజయసాయి రెడ్డి అధికార కూటమిలో ఉన్న పవన్‌ను మెచ్చుకోవడం చర్చనీయాంశం అయ్యింది. కొత్తగా ఏర్పడిన ఏపీకి యువ నాయకత్వం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 75 ఏళ్ల వయస్సు మీరిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేకంటే, ఎన్డీయే కూటమిలో కీలక నేతగా, ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం మంచిదని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పవన్‌కు ఉండే నేషనల్ పాపులారిటీ, చిన్న వయస్సు కారణంగా రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఉందని పేర్కొన్నారు. పవన్ ఎన్డీయే నాయకులలో ఆదర్శవంతమైన వ్యక్తి అని మెచ్చుకున్నారు.

