Andhra PradeshPoliticsTrending Today

లిక్కర్ స్కామ్‌పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

లిక్కర్ స్కామ్ విషయంలో వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌లో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని తేల్చి చెప్పారు. దీని గురించి అసలు విషయాలు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తానని పేర్కొన్నారు. నేడు కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి. జగన్‌కు రోటరీ వల్లే తాను దూరమయ్యాయని, జగన్ మనసులో తాను లేనని తెలిసే రాజీనామా చేశానని విచారం వ్యక్తం చేశారు. జగన్‌కు కేవీ రావు, వైవీ సుబ్బారావు అంటే ఇష్టం అన్నారు.  కేవీ రావు అంటే తనకు అసహ్యం అని, విరిగిన మనసుతో వైసీపీలో మళ్లీ చేరనని పేర్కొన్నారు. ఒక అధికారి ఆదేశాలతోనే నా పేరును ఈ కేసులో ఇరికించినట్లుగా కేవీ రావు చెప్పారు. కోటరీ నుండి బయటపడితేనే జగన్ అభివృద్ధి చెందుతారు. చెప్పుడు మాటలు ఎప్పుడూ నాయకుడు నమ్మకూడదు. చెప్పుడు మాటలు నమ్మితే పార్టీకి భవిష్యత్తు ఉండదు, జగన్‌కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుకుంటున్నాను. అంటూ విచారం వ్యక్తం చేశారు.