Andhra PradeshHome Page Slider

అచ్చెన్నాయుడిపై విజయసాయిరెడ్డి సెటైర్..

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి వయసు పెరిగినా మెదడు వృద్ధి చెందలేదంటూ సెటైర్ వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ప్రయత్నించారని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు విజయసాయిరెడ్డి. దీనితో ఎక్స్ ఖాతాలో సైటైరికల్ కామెంట్స్ చేశారు. అచ్చన్నా నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ జన్మకి నీ కోరిక తీరదు, నా విధేయత, నిబద్దతపై జోకులు వేయకు అని హెచ్చరించారు. మోకాలికి బోడిగుండుకు లింకుపెట్టొద్దంటూ వ్యాఖ్యానించారు.