Andhra PradeshHome Page Slider

రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకున్న విజయసాయి, అమిత్ షా భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమిత్ షా తో కలిసిన ఫోటోను పోస్ట్ చేసిన ఆయన రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. కీలక సమయంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కు విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో భేటీ కావటంపై విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు, ఏపీ రాజకీయాల్లో జనసేన-టీడీపీ పొత్తు అంశంతోపాటు, వైఎస్ వివేక హత్య-సీబీఐ విచారణతోపాటు పలు రాజకీయ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.