వైఎస్సార్‌ను అభిమానించేవారు షర్మిలను ఆశీర్వదించాలన్న విజయమ్మ
కడప ఎంపీ అభ్యర్థి వైఎస్సార్ తనయ, వైఎస్ షర్మిలకు ఇవాళ ఆమె తల్లి విజయమ్మ నుంచి మద్దతు లభించింది. ఈ ఎన్నికల్లో కడప ప్రజలు షర్మిలను ఆశీర్వదించాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఆమె 40 సెకండ్ల వీడియో ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించేవారు, ప్రేమించేవారందరూ కూడా ఆయన ముద్దుబిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తున్నారని ఆమెను ఆశీర్వదించి, పార్లమెంట్ కు పంపాల్సిందిగా విజయమ్మ కోరారు. ఇటీవల జగన్ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా తన బిడ్డను ఆశీర్వదించాలని కూడా విజయమ్మ చెప్పడం విశేషం. మరోసారి జగన్ అధికారంలోకి రావాలని, అందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
