రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయ సాయిరెడ్డి
వైఎస్‌ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వి.విజయసాయి రెడ్డి రాజ్యసభలో వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు కమిటీల్లో కొనసాగుతున్న విజయసాయి రెడ్డి ఈ హోదా పొందడం ఇదే తొలిసారి. అస్సాంకు చెందిన భువనేశ్వర్ కలిఠా, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ లంకప్ప హనుమంతయ్య, డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ, ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ సభ్యుడు సుస్మిత్ పాత్రో, బెంగాల్‌కు చెందిన బీజేపీ సభ్యుడు సుఖేందు శేఖర్ రే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నగర్ కూడా రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్‌లో ఉన్నారు. లోక్‌సభలోనూ ప్యానెల్ స్పీకర్‌గా వైసీపీకే చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొనసాగుతున్నారు.