Home Page SliderNational

విజయ్ వర్మ తమన్నాతో-రిలేషన్ షిప్ అంతా ఓపెన్ మైండ్

నటుడు విజయ్ వర్మ ఇటీవల తమన్నా భాటియాతో తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యారు. వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించడానికి గట్స్ ఉండాలని, ఆంక్షలపై తనకు నమ్మకం లేదని ఆయన వివరించారు. ఇలాంటి విషయాల్లో ఓపెన్ నెస్‌కు ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. సంబంధాన్ని సీక్రెట్‌గా ఉంచడానికి చాలా కష్టపడాల్సిన అవసరముందని విజయ్ పేర్కొన్నాడు. నటులు విజయ్ వర్మ, తమన్నా భాటియా ఒక ఏడాది పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, విజయ్, తమన్నా తమ బంధాన్ని బహిరంగంగా ఎందుకు అంగీకరించాలని నిర్ణయించుకున్నారో కూడా వివరించాడు. తన భావోద్వేగాలను పరిమితం చేయడం తనకు ఇష్టం లేదని, తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా తనకు, తమన్నాకు లేదని అతను చెప్పాడు.

తన ఛానెల్‌లో యూట్యూబర్ శుభంకర్ మిశ్రాతో మాట్లాడిన విజయ్, తాను, తమన్నా పరస్పరం అంగీకారంతో మూవ్ అవుతున్నామన్నారు. మేము కలిసి ఉండడానికి ఇష్టపడితే, ఈ విషయాన్ని దాచవలసిన అవసరం లేదు అనే వాస్తవంలో మేము ఇద్దరం ఉన్నామన్నారు. సంబంధాన్ని దాచడానికి చాలా శ్రమపడాలి. మీరు కలిసి బయటకు వెళ్లలేరు, మీ స్నేహితులు మీ ఫొటోలు క్లిక్ చేయలేరు. అలాంటి ఆంక్షలు కూడా నాకు ఇష్టం లేదు. నేను ఫ్రీ బర్డ్‌లా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను పంజరంలో ఉండాలనుకోవడం లేదు.

అదే ఇంటర్వ్యూలో, ఆయన స్పందిస్తూ, “ఈ రోజు, మన సమాజంలో, ప్రతి ఒక్కరూ ఇతరుల జీవితాలపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. సబ్కే అందర్ ఏక్ బువా బైతీ హై (ప్రతి ఒక్కరిలో గాసిపీ అత్త ఉన్నారు) దీని గురించి (సంబంధాల గురించి) మాత్రమే చర్చించాలనుకుంటున్నారు. ఇది ఒక వ్యాధిలా తయారైంది, మీరు దీనిని ఏమీ చేయలేరు. వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుండి, తమన్నా, విజయ్ పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇండియా టుడేతో సంభాషణలో, తమన్నా తన ఫస్ట్ కెరీర్ ప్లాన్‌లను షేర్ చేసుకొంది. ఇందులో 30 ఏళ్ల వయస్సులో పెళ్లి, ఇద్దరు పిల్లలు ఉండడం విశేషం.