Home Page SliderNational

విజయ్ “గోట్” పై అప్‌డేట్ రిలీజ్ చేసిన దర్శకుడు

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” గోట్ కోసం అందరికీ తెలిసిందే. విజయ్ కెరీర్‌లో 68వ సినిమాగా ఇది తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఎప్పటికప్పుడు సాలిడ్ అప్‌డేట్స్‌ని ఇస్తూ బజ్‌ని ఈ సినిమాపై పెంచుతూ వెళ్తున్నారు.

అలా ముందుగా దర్శకుడే ఈ సినిమాపై అప్‌డేట్స్ అందిస్తూ వస్తుండగా లేటెస్ట్‌గా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని అయితే తాను అందించాడు. ఈ చిత్రం నుంచి అతి త్వరలోనే మూడో సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్‌గా ప్రకటించాడు. ఇక దీనికి డేట్ ఏంటి ఎప్పుడు అనేది రివీల్ కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తన నుంచి వచ్చిన గత రెండు సాంగ్స్ మరీ అంత చార్ట్ బస్టర్స్ అయిపోలేదు. ఇక ఈ మూడో సాంగ్ అయినా ఎలా ఉంటుందో చూడాలి.