విజయ్ దేవరకొండ చిత్రానికి స్టార్ హీరోల వాయిస్..
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వీడీ 12’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తోంది. ఈ చిత్ర టీజర్ రేపు విడుదల కానుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషలలో రానుంది. దీనికోసం స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. హిందీలో ‘యానిమల్’ హీరో రణబీర్ కపూర్ వాయిస్‌తో ఈ చిత్రం మరింత వైల్డ్‌గా మారనుందని పేర్కొంది. అలాగే తమిళంలో స్టార్ హీరో సూర్య, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇస్తూ టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 28న విడుదల కానుంది.