విజయ్ బర్త్ డే..ట్రెండింగ్‌లో అభిమాని చేసిన వీడియో
ఈ రోజు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ పుట్టిన రోజు. దీంతో ఆయనకు సినీ వర్గాలు,అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు ఆయనపై స్పెషల్ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ వీరాభిమాని లియో సినిమాకు సంబంధించిన 3D యానిమేటడ్ వీడియోను క్రియేట్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా విజయ్ అన్నా..ఇది నీ కోసమే అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.