గోదావరి నదిలో విహార యాత్ర-పాపికొండల యాత్ర ప్రారంభం
భద్రాచలం-పాపికొండలు విహారయాత్ర టిక్కెట్ల అమ్మకాలు బుధవారం నుంచి భద్రాచలంలో ప్రారంభమయ్యాయి. భద్రాచలం రాములవారిని దర్శించుకోడానికి లాంచీలో ప్రయాణించే అవకాశం భక్తులకు చేరువైంది. నాలుగు రోజుల కిందట కేవలం టూరిజం లాంచీకి మాత్రమే అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేట్ లాంచీలకూ అనుమతి ఇచ్చింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం నుంచి పాపికొండల వరకు ఈ లాంచీలు నడవనున్నాయి.