Home Page SliderNational

నయనతారతో జాగ్రత్త విఘ్నేష్

‘లేడీ సూపర్ స్టార్‌’గా పేరుపొందిన స్టార్ హీరోయిన్ నయనతారపై జవాన్ హీరో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరదాగా ట్వీట్ చేశారు. ఆమె భర్త విఘ్నేష్‌నుద్దేశించి ‘నయనతారతో జాగ్రత్త విఘ్నేష్. కొట్టడంలో కొత్త పంచ్‌లు నేర్చుకుందంటూ’ హెచ్చరించారు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ట్రైలర్ చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు విఘ్నేష్. ఇంత బిగ్గెస్ట్ చిత్రంతో నయనతార బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉందని,షారుఖ్‌తో కలిసి నటించాలనే తన భార్య నయనతార కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు విఘ్నేష్. దీనికి షారుఖ్ ఇచ్చిన సమాధానంలో నయన్‌తో జాగ్రత్త అంటూ సూచించారు. నయన్ చాలా అద్భుతమైన వ్యక్తి అని, మా సినిమాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలని వ్యాఖ్యానించారు షారుఖ్. షారుఖ్ హీరోగా నటిస్తున్న ఈ జవాన్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి కూడా ముఖ్య పాత్రలు పోషించారు.