Home Page SliderNational

‘కల్కి’ నుంచి వీడియో సాంగ్ విడుదల..

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నుండి హుషారైన వీడియో సాంగ్ రిలీజయ్యింది. హీరో ప్రభాస్, హీరోయిన్ దిశాపటానీ కాంప్లెక్స్‌లో చిందులేసిన ‘ట టక్కర’ అనే పాట వీడియో సాంగ్ రిలీజైంది. వీరితో పాటు పాటలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, డైరక్టర్ అనుదీప్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తారు. ఈ పాటలో ప్రభాస్ సింపుల్‌గా వేసే స్టెప్స్ ఫాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం మొదటిరోజే అమెరికా వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. మహాభారత కథను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. రెండవ పార్టు చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ కామెంట్ చేశారు.