Home Page SliderTelanganatelangana,

దిలావర్‌పూర్ ప్రజల విజయం..ఇథనాల్ పరిశ్రమకు బ్రేక్

తెలంగాణ నిర్మల్ జిల్లాలోని దివావర్‌పూర్ ప్రజలు విజయం సాధించారు. అక్కడ ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు గ్రామస్థులు. వారికి విజయం లభించింది. ఎట్టకేలకు వారి వినతిని ప్రభుత్వం మన్నించింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రస్తుతానికి పరిశ్రమ పనులను ఆపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దిలావర్ పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది.