Home Page SliderTelangana

రాష్ట్రపతి చెంతకు లగచర్ల బాధితులు..

లగచర్ల బాధితుల గోడును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. ఇందుకోసం పార్టీ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. లగచర్లలో గిరిజనులపై పోలీసుల చర్యలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరడం ఆసక్తికరంగా మారింది. ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కలెక్టర్ పై దాడి, పోలీసుల చర్యలపైన, గిరిజన మహిళలపై దౌర్జన్యం వంటి అంశాలపై బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రపతి కార్యాలయానికి వివరాలను అందజేశారు. రాష్ట్రపతిని కలిసి తమ గోడును వినిపించేవరకు ఢిల్లీలోనే ఉంటామని గిరిజన మహిళలు స్పష్టం చేశారు.