భారత్ పర్యటనకు విచ్చేసిన ఉపాధ్యక్షుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేడు భారత పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం ఆయనతో భేటీ కానున్నారు. ప్రధానితో భేటీలో పలు అంశాలను చర్చించనున్నారు. ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, సుంకాలు ప్రధాన అంశాలుగా చర్చకు రానున్నాయి. వీటితో పాటు పలు ద్వైపాక్షిక అంశాలు కూడా చర్చిస్తారు. అనంతరం వాన్స్ దంపతులకు ప్రధాని విందు ఏర్పాటు చేస్తారు. వాన్స్ తన సతీమణి భారత సంతతికి చెందిన తెలుగు మహిళ ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లలో కలిసి నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌ను సందర్శించారు. వీరు ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు.