అందాల పోటీలపై విహెచ్‌పి ఆగ్రహం
కాశ్మీర్‌లో హిందువుల రక్తంతో దేశం విషాదంలో ఉంటే, తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించడం సిగ్గుచేటని విహెచ్‌పి జాతీయ ప్రతినిధి డా. రావినూతల శశిధర్ ఆగ్రహించారు. శత్రు దేశాల అందాల భామలతో కవాతు, అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం భద్రతను విస్మరిస్తోందని ఆరోపించారు. పోటీల రద్దు, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.