తెలుగురాష్ట్రాలలో భానుడి భగభగలు- విలవిల్లాడుతున్న ప్రజలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లల్లాడుతున్నారు. ఎండలకు తట్టుకోలేక సొమ్మసిల్లిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, రాజమండ్రిలలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏలూరులో 47 డిగ్రీలు నమోదు అయ్యింది. అత్యల్పంగా విశాఖలో 36 డిగ్రీలు నమోదయ్యింది.

ఇక తెలంగాణాలోని కొత్తగూడెం, పాల్వంచలలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా,దాదాపు అన్ని జిల్లాలలోనూ 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుండి, సాయంత్రం 4 గంటల మధ్యకాలంలో రోడ్డుపై తిరగవద్దని, వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు వహించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

