Home Page SliderTelangana

బండి సంజయ్ కుమార్‌ని కలిసిన వెంకటరమణారెడ్డి

కరీంనగల్: శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి మంగళవారం రాత్రి కరీంనగర్‌లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ను ఎంపీ క్యాంపు ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా తన గెలుపుకై పోరాడిన అంశాలపై చర్చించారు. బండి సంజయ్ వెంకటరమణారెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.