Home Page SliderTelangana

ఖాళీ డాబాలపై కాయగూరల పంటే మేలంట!

ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దిగుమతి తగ్గిపోవడం, వర్షాభావం వంటి పరిస్థితులతో టమాట, బీరకాయ వంటివి కొనాలంటేనే జంకే పరిస్థితి. పెరిగిన ధరలను చూసి మిద్దెపై నాలుగు కూరగాయల పంటలు వేసుకుంటే బాగుండునని ఆలోచనతో మహిళలు రకరకాల కాయగూరల పంటలు పండిస్తున్నారు. గృహస్థులు, భవనంపై కాస్తంత చోటుంటే కుండీల్లో సైతం కూరగాయలు సాగు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయల అవసరాలు తీరాలనే ఆలోచన చేసేవారి కోసం ఒక ఐడియా చెబుతాను. ముందుగా నాలుగు పాత డబ్బాలు, మన్నిక గల సంచులు సేకరించి మట్టినింపాలి. ప్రారంభంలో ఆకుకూరల విత్తనాలు వేస్తే 15 రోజుల్లోనే పంట చేతికి అందుతుంది. కాస్త పట్టు వచ్చి నమ్మకం కుదిరిన తరువాత కూరగాయల విత్తనాలు వేసుకుంటే మంచిది. అలా కొంచెం కొంచెం పాదులు పెడుతూ పెంచుకుంటూ పోతే సరిపోతుందన్నది అనుభవం గల మహిళలు చెబుతున్నారు. ఒకసారి మొక్కలు నాటి చూస్తే పోలే..