కూరగాయల ధరలు పైపైకి
ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్ నగరానికి రోజూ ఎనిమిది వేల క్వింటాళ్ల వరకు వచ్చేవి. దాంతో ఆరు నెలలుగా కిలో రూ.20 లు చొప్పున స్థిర ధరల్లోనే ఉండేవి. 15 రోజుల్లోనే అమాంతం పెరిగిన ధరలు, రైతు బజార్లతో పోలిస్తే మార్కెట్‌లో 60 శాతం వరకు అధికంగా పెరిగాయి. ఇతర రాష్ట్రాల నుండి దిగుబడులు తగ్గాయి. స్థానికంగా పంట వృద్ధి చెందని పంటల సాగు. అవసరమైన మేరకు సరకు వస్తే కిలో రూ.20 నుండి రూ.25 వరకే దొరుకుతాయని అంటున్నారు వ్యాపారులు.

