Home Page SliderNational

2 పార్ట్స్‌గా వీడీ 12

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్‌ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వీడీ 12’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 23న విడుదల చేయనున్నట్లు ఇటీవలే నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను నిర్మాత నాగవంశీ అందించారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని తెలిపారు. ‘రెండు పార్టులకు సరిపోయే కంటెంట్‌ రెడీగా ఉంది. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి కథను అద్భుతంగా తీస్తున్నారు. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో భాగం నిర్మాణం గురించి ఆలోచిస్తాం. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనబడనున్నారు.