home page sliderHome Page SliderTelangana

ఆదిలాబాద్ లో వీసీ సజ్జనర్..

టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సోమవారం ఆదిలాబాద్ డిపో, బస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. డిపో పరిధిలోని తిరుగుతున్న సర్వీసులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లతో పాటు గ్యారేజీ సిబ్బందితో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పనితీరును ఆరా తీశారు. బస్ స్టేషన్ లో ఆర్టీసీ అందిస్తోన్న సేవలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ తో కూడిన కీ చైన్ లను ప్రయాణికులకు అందజేశారు. అనంతరం బస్సు డిపో ఆవరణలో మొక్కలను కూడా నాటారు.