Home Page SliderNational

ముంబైపై మరోసారి విజృభించిన వరుణుడు

దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన విషయం తెలిసిందే.అయితే మరోసారి ముంబైలో వరుణుడు విజృంభిస్తున్నాడు.దీంతో ఈ రోజు ఉదయం నుంచి ముంబైలో వర్షం పడుతోంది. కాగా ఈ రోజు,రేపు ముంబై,థానే,పాల్ఘర్,రాయగఢ్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ క్రమంలో ముంబైలో రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది.కాగా గతంలో కురిసిన వర్షాలకు ముంబై మహనగరమంతా స్తంభించిపోయింది.