Home Page SliderNational

అంజిని బాలీవుడ్ అరంగేట్రంపై వరుణ్ ధావన్ కామెంట్స్

మేనకోడలు అంజిని బాలీవుడ్ అరంగేట్రంపై వరుణ్ ధావన్ “సినిమాలకు స్వాగతం” అని పలికారు. “మా కుటుంబంలో ఆ సంప్రదాయం లేదు కాబట్టి మా నాన్న నన్ను ఎప్పుడూ సినిమాలవైపు చూడనీయలేదు, అతను దానిని నమ్మడు” అని వరుణ్ ధావన్ అన్నాడు. శుక్రవారం ముంబైలో జరిగిన తన మేనకోడలు అంజినీ ధావన్ తొలి చిత్రం బిన్నీ అండ్ ఫ్యామిలీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వరుణ్ ధావం ఎటెండ్ అయ్యారు. తన మేనకోడలి నటన గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ, “ఆమె నాకు మేనకోడలు, కానీ నేను ఇక్కడ అన్నయ్యలా ఉన్నాను. ఇది మంచి సినిమా, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. మా నాన్నగారు నన్ను ఎప్పుడూ లాంచ్ చేయలేదు ఆ సంప్రదాయం. నా కుటుంబంలో లేదు, ఆమె చేసిన పనిలో మాకు ఎలాంటి అపనమ్మకం లేదు, ఆమె విజయానికి అది నా క్రెడిట్ అని గొప్పలు చెప్పుకోవడం తప్పు” అని వరుణ్ పేర్కొన్నట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. వరుణ్ ప్రముఖ సినీ నిర్మాత డేవిడ్ ధావన్ కొడుకు. కరణ్ జోహార్ 2012 చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో తన సినీ రంగప్రవేశం చేసిన వరుణ్ ధావన్, “నిజంగా, ఆమె సొంత నిర్ణయమే, ఆమె సాహసానికి నేను ఎప్పుడూ ప్రోత్సాహం తెలుపుతాను, అని చేతులు జోడించి నమస్కారాలు తెలిపారు.

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బిన్నీ అండ్ ఫ్యామిలీ ట్రైలర్‌ను షేర్ చేస్తూ, వరుణ్ ధావన్, “అంజినీ ధావన్, ఇది చాలా మంచి నిర్ణయమే, బాగుంది. సినిమాలలో యాక్ట్ చేస్తున్నందుకు వెల్‌కమ్ అన్నారు. బిన్నీ అండ్ ఫ్యామిలీ చిత్రానికి స్సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహించారు. ఇందులో నమన్ త్రిపాఠి పంకజ్ కపూర్, రాజేష్ కుమార్, హిమానీ శివపురి, చారు శంకర్ కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వరుణ్ ధావన్ ఇటీవలే స్త్రీ 2లో అతిధి పాత్రలో కనిపించాడు. అతను జాన్వీ కపూర్‌తో కలిసి నటించిన బవాల్‌లో చివరిగా కనిపించాడు. అంతకు ముందు అతను కృతి సనన్‌తో కలిసి ఫాంటసీ చిత్రం భేదియాలో నటించాడు. అతని లైనప్ ప్రాజెక్ట్‌లలో సిటాడెల్: హనీ బన్నీ (ది ఇండియా చాప్టర్), సమంతా రూత్ ప్రభుతో కలిసి నటించారు. సిటాడెల్ అనేది భారతదేశం, ఇటలీ, మెక్సికో నుండి నిర్మాణాలతో కూడిన బహుళ – సిరీస్. సిటాడెల్ భారతదేశ అధ్యాయానికి రాజ్, DK నాయకత్వం వహించారు. బేబీ జాన్‌లో కూడా నటించనున్నాడు. అతను సన్నీ డియోల్‌తో కలిసి బోర్డర్ 2 లో కూడా యాక్ట్ చేయనున్నాడు. వరుణ్ ధావన్ అక్టోబర్, హంప్టీ శర్మకి దుల్హనియా, ABCD 2, జుగ్‌జగ్ జీయో, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, బద్లాపురంద్ దిల్‌వాలే వంటి కొన్ని చిత్రాలలో యాక్టింగ్ చేసి స్టార్‌గా ఎదిగాడు.