ఏపీలో ముగిసిన వారాహి తొలిదశ యాత్ర
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14న వారాహి యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. దీంతో పవన్ వారాహి యాత్ర తొలిదశ పూర్తి అయ్యిందని జనసేన తాజాగా ట్వీట్ చేసింది. దళితుల సంక్షేమ పథకాలు, నిరుద్యోగం, విద్యార్థుల కష్టాలు, రైతుల సమస్యలు, ఆత్మహత్యలు, కనీస వసతులు లేని హాస్పిటల్స్, బీసీల సమస్యలు, అధ్వానమైన రోడ్లు, పిఠాపురం చెరువుల ధ్వంసం, అక్రమ మట్టి తరలింపు, కోనసీమ రైల్వే లైన్, కొబ్బరి ,ఆక్వాకల్చర్ వంటి ఎన్నో అంశాలపై ప్రభుత్వ అసమర్థ వైఖరిని ఎండగట్టారు అని జనసేన ట్వీట్ చేసింది.

