వంగా గీత ఎమోషనల్, క్లైమాక్స్‌లో దద్దరిల్లిన పిఠాపురం
ఏపీలో మరో 36 గంటల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పిఠాపురంలో జరిగిన ఎన్నికల సభ రసవత్తరంగా సాగింది. జనసేనాని పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీ చేస్తోండటంతో ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. అదే సమయంలో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు ఎవరిని దించాలా అని ఆలోచించిన పవన్ కల్యాణ్ అక్కడ్నుంచి ఒక మహిళను బరిలో నిలిపారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పోటీలో పెట్టి పవన్ కల్యాణ్ కు ట్విస్ట్ ఇచ్చారు. మొదట లక్ష మెజార్టీ, ఆ తర్వాత 50 వేల మెజార్టీ అంటూ జనసైనికులు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేశారు. తాజాగా ఇప్పుడు ఎంత మెజార్టీ వస్తోందన్నది పక్కనబెడితే, ఇప్పుడు పిఠాపురంలో వంగా గీతను గెలిపించుకుంటే తానేం చేస్తానో ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన గీత ఎమోషనల్ అయ్యారు. అందరికీ ఒకటే చెబుతున్నా.. నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదని అవహేళన చేస్తున్నారు. నన్ను అవమానిస్తున్నారు. నన్ను మీకు దూరం చేస్తున్నారు. నేను నా కుటుంబ సభ్యులను క్షమించాలని గీత కోరారు. నాపీఠాపురమే తన కుటుంబమని, నా మాటే శాసనమని చెప్పారు. తన పుట్టుక పిఠాపురానికి దగ్గర చేయలేకపోతే… నా అంతిమ యాత్ర పాదగడయలోనే జరగాలన్నారు వంగా గీత. నా ఆడపడుచులు, అన్నదమమ్ములు పసుపు కుంకుమపెట్టి నన్ను పంపించాలని కోరారు. పిఠాపురం నుంచి వెళ్లిపోతాను. తనను అవమానిస్తున్నారన్నా తనను దూరం చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఇక్కడ్నుంచి పిఠాపురం వదిలిపెట్టనని చెప్పారు. కొంగుచాచి అడుగుతున్నానని చెప్పారు. ఈ ఒక్క అవకాశం అడుగుతున్నానన్నారు. అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కుక్కుటేశ్వర స్వామి, రాజేశ్వరమాత అనుగ్రహం ఉంటే మళ్లీ ఇక్కడే పిఠాపురంలోనే పుడతానన్నారు. మీరుణం తీర్చుకుంటానని చెప్పారు.

ఇక గీత తర్వాత మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ చివరి సభలో అసలు పంచ్ విసిరారు. పవన్ కల్యాణ్ పై వంగా గీతను నిలబెట్టడం ద్వారా ఆయన ప్రత్యేక స్ట్రాటజీ అవలంబించారు. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే తానేం చేస్తానో చెప్పారు. గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కాపులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా నియమించిన జగన్, రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టేలా అడుగులు వేశారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల నుంచి వంగా గీతను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వచ్చే ఎన్నికల్లో వంగా గీతను గెలిపిస్తే ఆమెను తన కేబినెట్‌లో వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానంటూ జగన్ ఓటర్లకు హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో కాపు రాజకీయాన్ని సరికొత్త పుంతలు తొక్కించారు జగన్.

ఓవైపు వంగా గీతను పిఠాపురంలో గెలిపించుకోవాలని చెబుతూనే, కాపు సామాజికవర్గానికి తాను దగ్గరగా ఉన్నానన్న భావనను కలిగించారు. వంగా గీత తనకు అక్కలాంటిదని, తనకు తల్లిలాంటిదని, బ్రహ్మండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన అక్కను డిప్యూటీ సీఎం చేసి పిఠాపురానికి పంపిస్తానన్నారు. మీ కోసం, మీ అభివృద్ధి కోసం, మీకు మంచి చేయడం కోసం పంపిస్తానన్నారు. అక్కను గెలిపిస్తే తన పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీకోసం మంచి చేపిస్తానంటూ జగన్ ఓటర్లకు భరోసా ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వంగా గీత భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరుపెట్టుకున్నారు.