డిప్యూటీ సీఎంగా వంగా గీత, పిఠాపురంలో జగన్ హామీ
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల నుంచి వంగా గీతను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వచ్చే ఎన్నికల్లో వంగా గీతను గెలిపిస్తే ఆమెను తన కేబినెట్‌లో వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానంటూ జగన్ ఓటర్లకు హామీ ఇచ్చారు. వంగా గీత తనకు అక్కలాంటిదని, తనకు తల్లిలాంటిదని, బ్రహ్మండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన అక్కను డిప్యూటీ సీఎం చేసి పిఠాపురానికి పంపిస్తానన్నారు. మీ కోసం, మీ అభివృద్ధి కోసం, మీకు మంచి చేయడం కోసం పంపిస్తానన్నారు. అక్కను గెలిపిస్తే తన పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీకోసం మంచి చేపిస్తానంటూ జగన్ ఓటర్లకు భరోసా ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వంగా గీత భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరుపెట్టుకున్నారు.