Andhra PradeshNews

తిరుపతికి రానున్న వందేభారత్.

హైదరాబాద్ వాసులకు శుభవార్త. తిరుపతికి త్వరగా చేరుకోగలిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి వందేభారత్‌ను ప్రధాని మోదీ విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. అయితే రెండవ వందేభారత్ రైలును తిరుపతిలో ప్రారంభించబోతున్నారు. తిరుపతి -సికింద్రాబాద్ మధ్య వారానికి ఆరురోజుల పాటు ఈ రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే వర్గాల సమాచారం. నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందింది. తిరుపతికి హైదరాబాద్ నుండి నిత్యం వేల సంఖ్యలో భక్తులు ప్రయాణాలు చేస్తుంటారు. మూడు, నాలుగు వారాల ముందుగా ప్రయత్నిస్తే కానీ రిజర్వేషన్లు దొరకవు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి నాలుగు మార్గాల్లో రైళ్లు వెళ్తుంటాయి. వీటిలో ఏమార్గంలో వందేభారత్ రైలును నడుపుతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఈ రైలును ఏప్రిల్ 8 నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.