Home Page SliderNews Alert

సూపర్ స్పీడ్‌తో వందే భారత్ 

భారత్‌లో వందే భారత్ రైళ్లు చాలా వేగంగా వెళ్తాయని మనకు తెలుసు.  ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రైలు వేగం క్రమక్రమంగా పెంచుతూ పరీక్షలు చేస్తోంది. ఈ పరీక్షలో రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక వీడియోను షేర్ చేశారు.