ఆగస్ట్ 15 నుండి వందే భారత్ స్లీపర్ రైళ్లు
హైదరాబాద్: కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. వీటిని కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుండి నడపాలని ద.మ. రైల్వే అధికారులు ప్రతిపాదించారు. కొత్తగా నడపనున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అత్యంత రద్దీ రూట్లైన కాచిగూడ- విశాఖ, కాచిగూడ- తిరుపతి, సికింద్రాబాద్- పుణె మార్గాల్లో నడపాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు 16 బోగీలతో రాత్రి నడపనున్నారు.