వందేభారత్ స్లీపర్ తొలి రైలు హైదరాబాద్-ముంబై?
హైదరాబాద్: వందేభారత్ తొలి స్లీపర్ రైలును ఆగస్టులో పట్టాలు ఎక్కించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ద.మ. రైల్వే పరిధి నుండి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్- ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలున్నాయి. ఈ నగరాల మధ్య ఇప్పటివరకు వందేభారత్ రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలో నడపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద.మ. రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌కు తాజాగా సూచించారు.