Home Page SliderInternational

హిందూ ఆలయంలో విధ్వంసం.. భక్తులపై ఖలిస్తానీ దాడులు

కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. బ్రాంప్టన్ లోని ఆలయంలో విధ్వంసం సృష్టించారు. హిందూ భక్తులపై కర్రలతో దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్ద భారీగా మోహరించారు. అయితే ఘర్షణకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. అన్ని మతాల విశ్వాసాలను కాపాడుతామన్నారు. కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు పరిధులు దాటిపోయారని భారత సంతతికి చెందిన ఆ దేశ ఎంపీ చంద్ర ఆచార్య ఆరోపించారు.