వంశీకి మళ్లీ నిరాశే..
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇవాల్టితో రిమాండ్ ముగుస్తుండగా విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆయనకు రేపటి వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు మళ్లీ జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబు రిమాండ్ కూడా రేపటి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేసులో పరారీలో ఉన్న మరికొంత మంది కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.